Wednesday, April 2, 2025

ఈటల రాజేందర్‌కు వై ప్లస్ సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈటల రాజేందర్‌కు వై ప్లస్ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి హుజురాబాద్ ఎంఎల్‌ఎ రాజేందర్‌కు వై ప్లస్ స్టేట్ కేటగిరి భద్రత ఏర్పాటు చేయనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈటల రాజేందర్ వెంట ఉండనున్నారు. భద్రతకు సంబంధించి మేడ్చల్ డిసిపి సందీప్ రావు గురువారం ఈటల రాజేందర్ ను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలను ఈటల నుంచి సేకరించారు. దీనికి సంబంధించి డిజిపికి సీల్డు కవర్‌లో డిసిపి సందీప్ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News