Wednesday, November 13, 2024

కెసిఆర్‌పై వ్యాఖ్యలు చేసి బుక్కయిన వై.ఎస్.షర్మిల

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌ను ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ అన్నందుకు ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) పేపర్ లీక్ కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వై.ఎస్. షర్మిలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నాయకుడు నరేంద్ర యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై బంజార హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. టిఎస్‌పిసి నిర్వహించిన పరీక్షలో ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై షర్మీల విలేకరుల సమావేశంలో, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు షర్మిలపై ఐపిసి సెక్షన్లు 505(2), 504 కింద కేసులు పెట్టారు. ఇంకా ఫిర్యాదులో బిఆర్‌ఎస్ పార్టీని ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ అని వ్యాఖ్యానించారని కూడా పేర్కొన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి సోదరి. ఆమె ప్రభుత్వ వైఫల్యంపై రాసిన అఫిడవిట్‌పై కెసిఆర్ సంతకం పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పత్రం లీక్ కావడంపై షర్మిల చిందులు తొక్కుతున్నారు. టిఎస్‌పిఎస్‌సికి చెందిన ఇద్దరు ఉద్యోగులు పరీక్ష పత్రాలు దొంగిలించారని, ఆ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు అమ్ముకున్నారని ఆరోపణ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News