Monday, December 23, 2024

పేపర్ లీకుపై సిబిఐ విచారణ జరిపించాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకుల వెనుక వున్న దోషలను పట్టుకునేందుకు సీబిఐ చేత విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆదివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. పేపర్‌లీకుల కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 19మందిని అరెస్టు చేసినట్టు సిట్ చెవుతోందన్నారు. ఇందులో పాత్రధారులను మాత్రమే చూపెడుతూ సూత్రధారలెవరో తేల్చడం లేదన్నారు. బోర్డు సభ్యుల్లో కనీసం ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదన్నారు.

కనీసం కాన్ఫిడెన్సియల్ అధికారులను కూడ బాధ్యతలనుంచి తప్పించలేదన్నారు. దర్యాప్తు ముగిసే వరకూ బోర్డు సభ్యులపైన నిఘా పెట్టాలన్నారు. ఈ కేసును సీబిఐకి అప్పగించి దోషులను కఠింనంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. టిఎస్‌పిఎస్‌సి ప్రస్తుత బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని షర్మిల విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News