Friday, November 15, 2024

భీకరంగానే దూసుకువస్తోన్న యాస్

- Advertisement -
- Advertisement -

Yaas storm is likely to cross coast by may 26th

బెంగాల్ వైపు అలర్ట్ ..యుద్ధ నౌకలు సిద్ధం
26 నాటికి తీరం దాటే అవకాశం
పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ?

కోల్‌కతా : యాస్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతం తీరం వెంబడి అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నార్త్ అండమాన్ ప్రాంతపు సముద్రజలాలలో తలెత్తిన అల్పపీడనం బలోపేతం అయ్యి, తీవ్రస్థాయి తుపాన్ అవుతుందని రెండు మూడు రోజుల క్రితమే భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. ఇప్పుడిప్పుడే తౌక్టే తుపాన్ ప్రభావం సమసిపోతున్న దశలో యాస్ ముంచుకురావడం కలవరానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరం వెంబడి నావికదళ షిప్‌లు, విమానాలు ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంచారు. పరిస్థితిని బట్టి తక్షణ సహాయ, రక్షణ చర్యలను చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది.

శనివారం వెలువరించిన అధికారిక ప్రకటన మేరకు నాలుగు నావికదళానికి చెందిన నాలుగు షిప్‌లను మానవీయ సహాయం, విపత్తు నివారణ చర్యలు (హెచ్‌ఎడిఆర్) పరిధిలో సిద్ధం చేసి ఉంచారు. విశాఖపట్టణం నౌకాకేంద్రం వద్ద ఐఎన్‌ఎస్ డేగా, చెన్నైకి సమీపంలో ఐఎన్‌ఎస్ రజాలీ నౌకలను సిద్ధంగా ఉంచినిట్లు నావల్ ఎయిర్ స్టేషన్స్ అధికారులు శనివారం తెలిపారు. యాస్ తుపాన్ ఈ నెల 26వ తేదీ నాటికి ఉత్తర ఒడిషా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ విభాగం తెలిపింది. గత వారపు తౌక్టే తుపాన్‌తో దేశ పశ్చిమ తూర్పు రాష్ట్రాలను దెబ్బతీసింది. ఈవారం చివరిలో లేదావచ్చేవారం ఆరంభంలో తీరం దాటే యాస్ తుపాన్‌తో దేశ తూర్పు ప్రాంతపు రాష్ట్రాలు ప్రభావితం కానున్నాయి.

మల్లెలాగానే తాకుతుంది

ప్రమాణిక పద్ధతుల ప్రకారం ఈ రాబోయే తుపాన్‌కు ఒమన్ దేశం యాస్ అనే పేరు పెట్టింది. దీనిని యాస్ లేదా యాష్ అంటారు. అయితే ఉచ్చరణలో యాస్‌గానే పిలుస్తారు. ఒమన్ పెట్టిన యాస్ అనే పదం పర్షియా భాషలోనిది. అంటే మల్లె అనే అర్థం వస్తుంది. దీని పరిమళంలాగా తుపాన్ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. యాస్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తరువాతి దశలో బంగ్లాదేశ్ తీరానికి 26 నాటికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో ఉత్తర భారత మైదాన ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు పడుతాయని విశ్లేషించారు.

నైరుతికి ముందు తుపాన్‌ల ఎఫెక్ట్

నడి వేసవిలో అరేబియా సముద్రంలో తుపాన్‌లు ఏర్పడటం అత్యంత అరుదైన పరిణామంగా ఇటీవలి తౌక్టే దెబ్బతో స్పష్టం అయింది. సాధారణంగా ఎప్రిల్ మే నెలలు, అక్టోబర్ డిసెంబర్ మధ్యలో తుపాన్లు ఏర్పడుతుంటాయి. అయితే ఈ తుపాన్‌ల కేంద్రీకృత ప్రాంతాలు మారడం ఇప్పుడు ఐఎండి పరిశీలనకు వెళ్లింది. రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళకు తాకాల్సి ఉంది. ఇప్పటికే సముద్ర ఉపరితలంలో రుతుపనవాల సందడి సవ్యంగా ఉంది. అయితే ఈ క్రమంలో తలెత్తే తుపాన్‌ల ప్రభావం ఒక్కోసారి రుతుపవనాల గతిని వేగాన్ని మార్చివేసేందుకు వీలుంది. లేదా ఇవి మరింత పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News