మోత్కూర్: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిధిలోని పొడిచేడు, దాచారం, అనాజీపురం గ్రామ శివార్లలో జరిగింది. అనాజీపురం దాచారం గ్రామాల మధ్య తొర్రూర్ వలిగొండ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిధాన్ పురం గ్రామానికి చెందిన కాక గణేష్ (23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన పులిబచ్చల సంపత్ లు ఇద్దరు టిఎస్ 05 ఇజె 8506 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళుతుండగా దాచారం అనాజిపురం గ్రామాల మధ్య అనాజిపురం నుండి వీరికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న బైకును డీ కొనడంతో బైక్ నడుపుతున్న కాక గణేష్ హెల్మెంట్ లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెనుక కూర్చున్న సంపత్ హెల్మెంట్ ధరించడంతో స్వల్ప గాయాలతో ప్రాణాల నుండి బయటపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి నాగరాజు తెలిపారు.
పొడిచేడు గ్రామంలో కల్వర్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులు సమాచారమిచ్చారు. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తీపిరెడ్డి సుదర్శన్ రెడ్డి(52)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. మద్యం మత్తులోనే శనివారం రాత్రి అతను పొడిచేడు వచ్చి బస్టాప్ వద్ద పడుకున్నట్టు చెబుతున్నారు. మృతునికి భార్య లక్ష్మీ, కొడుకు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని, కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు.