Monday, April 28, 2025

భువనగిరిలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు…

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించడంతో సజీవదహనమయ్యాడు. కాలుతున్న మృతదేహం, బైక్ ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా వరంగల్ జిల్లా కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News