- Advertisement -
పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు హైదరాబాద్ కు చెందిన వంశీ, బాలు, వినయ్, హర్ష, దినేశ్ గా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. ఒక యువకుడు చెరువులో నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
- Advertisement -