Saturday, December 21, 2024

రాష్ డ్రైవింగ్… అడిగినందుకు కత్తులతో పొడిచారు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కారు అతి వేగంగా నడిపి స్థానికులను భయబ్రాంతులకు గురి చేయడంతో పాటు అడిగినందుకు వాహనదారులపై కత్తులతో దాడి చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆరుగురు యువకులు కారులో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ కు వెళ్తున్నారు. కారు అతివేగంగా నడపడంతో పాటు వాహనాదారుల పైకి దూసుకొచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. చిన్నకొండూరు రోడ్డులోని మైత్రి వెంచర్ సమీపంలో కారును స్థానికులు పట్టుకున్నారు.

కారులో ఉన్న ఆరుగురు యువకులు కత్తులు తీసి స్థానికులపై దాడి చేశారు. ఈ దాడిలో సిపిఎం నేత, కౌన్సిలర్ హిమబిందు భర్త దండ అరుణ్ కుమార్, సుర్వి సురేందర్ కడుపులో కత్తి పోట్లు దిగాయి. సుర్కంటి బాలకృష్ణా రెడ్డి చేతిపై కూడా పొడిచారు. అనంతరం వారు పారిపోతుండగా స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు నిందితులు భవనంపైకి ఎక్కారు. భవనం పైనుంచి కిందకు దూకడంతో ఇద్దరు గాయపడ్డారు. మరో గదిలో దాక్కున్న ఇద్దరిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News