యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. శ్రీ వారిబాలాలయంలో అంతరంగికంగా జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో గీత, కమిటీ చై ర్మన్ నర్సింహమూర్తి తెలిపారు. ఇందుకు సం బంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తొ లి రోజున స్వస్తివాచనంతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, అం కురార్పణం జరుగుతాయన్నారు. 5న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహ ణం, భేరి పూజ, దేవతాహ్వానం, 6వ తేదీ నుంచి స్వామివారికి అలంకార సేవలు ప్రారంభించి మత్సావతార అలంకారం, శేషవాహన సేవ, 7న వటపత్రశాయి, హంసవాహన సేవ, 8న శ్రీకృష్ణాలంకరణ, పొన్నవాహన సేవ, 9న గోవర్ధన గిరిధారి, సింహవాహన సేవ, 10న జగన్మోహిని అలంకారం, ఆశ్వవాహన సేవ, ఎదుర్కోలు, 11న శ్రీరామ అలంకార హనుమాన్ సేవ జరుగుతాయన్నారు. అదేరోజు ఉదయం 11 గంటలకు తిరుకల్యాణం, 12న శ్రీమహావిష్ణు అలంకారంలో గరు డ వాహనసేవ, రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరుగుతుందన్నారు. 13న మహాపూర్ణహుతి, చక్రతీర్థం, పుప్షయాగం, 14న శ్రీ స్వామివారికి అష్టోత్తర శతఘాటాభిషేకం, శృంగార డోలోత్సవం ఉత్సవంతో పూర్తవుతాయని తెలిపారు.