Monday, January 20, 2025

వైభవంగా ముగిసిన పాతగుట్ట అధ్యయనోత్సవాలు

- Advertisement -
- Advertisement -

నేటి నుంచే పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు

మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. శ్రీవారి ఆలయ అధ్యయనోత్సవాలు నాలుగు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఆలయ విశిష్టతను తెలుపుతూ కొనసాగాయి. ఆదివారం అధ్యయనోత్సవాల్లో చివరి రోజు ముగింపు సందర్భంగా ఉదయం స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు గావించి శ్రీలక్ష్మీనరసింహుడిని అలంకరించి పారాయణికులచే పారాయణాలు గావిస్తూ మేళతాళాల మధ్య మంత్రోచ్ఛరణలతో ఆలయ వీధులలో ఊరేగింపు సేవను నిర్వహించారు.

అనంతరం ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలో కొలువుదీర్చి అధ్యయనోత్సవాల విశిష్టతను భక్తకోటికి తెలియజేయగా స్వామివారిని భక్తులు దర్శించుకొని తరించారు. ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజనం, నవకలశస్నపన మహోత్సవములను వైభవంగా నిర్వహించి అధ్యయనోత్సవాలు ముగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, ప్రధానార్చకులు, వేదపండితులు, అర్చకుల బృందం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Yadadri brahmotsavam

పాతగుట్టలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి అనుబంధ క్షేత్రమైన పాతగుట్ట (పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నేటి నుంచి ఏడు రోజుల పాటు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు సోమవారం ఉదయం 10 గంటలకు స్వస్తివాచనం, పుణ్యహవచనం, రక్షాబంధనముతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 20న ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, 21న ఉదయం సింహవాహన అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోళ్ల మహోత్సవం, 22న ఉదయం హనుమంత వాహన అలంకార సేవ, రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణమహోత్సవం, 23న ఉదయం గరుడ వాహన అలంకార సేవ, రాత్రి రథ హోమం, దివ్యవిమాన రథోత్సవం, 24న ఉదయం మహాపూర్ణాముతి చక్రతీర్ధం, రాత్రి డోలోత్సవం, పుష్పయాగం, 25న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News