Monday, January 20, 2025

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తొలి రోజు పూజలో పాల్గొననున్న సిఎం, మంత్రులు..

11 రోజుల పాటు వేడుకలు..

యాదాద్రి భువనగిరి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు స్వస్తీ వాచనం, అంకురార్పణ కార్యక్రమం, విశ్వక్సేనారాధన, రక్షా బంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. స్వామి వారికి సీఎం రేవంత్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్‌లో భద్రాచలం పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండ పైన దేవస్థానం ఆంక్షలు విధించింది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఈవో రామకృష్ణా రావు తెలిపారు. కొండ పైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News