Tuesday, January 21, 2025

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మినరసింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తెల్లవారు జాము నుంచే యాదాద్రి కొండకు తరలి స్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయంలో జరిగినట్టు వంటి నిత్యా పూజలు, సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, ని త్యా కళ్యాణం, జోడి సేవ, సువర్ణ పుష్పార్చన, వ్రత పూ జలలో భక్తులు పాల్గొని మొ క్కుబడులు చెల్లించు కున్నారు. వివిద ప్రాంతాల అధిక నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు, దర్శన క్యూ లైన్లు తదితర ప్రాంతాల్లో భక్తుల సందడి కనపడింది. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటలకు పైగా సమయం పట్టింది. కొండపైన శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివ దర్శనం, కొండా కింద శ్రీ పాత లక్ష్మి నరసింహ స్వామిని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఆలయ నిత్యారాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ నిత్యరాబడి లో భాగంగా ఆదివారం రూ. 41,63,554 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బు కింగ్, బ్రేక్ దర్శనం, వి.ఐ.పి దర్శనం, ప్రసాద వి్ర కయం, పాత గుట్ట, శివాలయం, వివిధ శాఖల నుంచి ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News