Sunday, December 22, 2024

చెల్లింపులు లేకనే యాదాద్రి జాప్యం

- Advertisement -
- Advertisement -

తేల్చి చెప్పిన బిహెచ్ఎల్ అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలోనే రాష్ట్ర విద్యుత్ బిహెచ్‌ఈఎల్ అధికారులకు మధ్య శుక్రవారం సెక్రటేరియేట్‌లో వాగ్వివాదం జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణాల్లో అంతులేని జాప్యం జరిగిందని, అందుకు ఎవ్వరు బా ధ్యులు..? అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గట్టిగా నిలదీయడంతో ముందుగా ఒ కరిపై మరొకరు “మీరే కారణమంటే… మీరే కారణమంటూ” విద్యుత్ బిహెచ్‌ఈఎల్ అధికారులు పరస్పరం వాదులాడుకొన్నట్లుగా తెలిసింది. దీంతో ఆగ్రహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల కాంట్రాక్టు బాధ్యతలను చేపట్టిన బిహెచ్‌ఈఎల్ అధికారులపై మండిపడ్డారని, బిహెచ్‌ఈఎల్ కంపెనీ నిర్ల క్షం కావచ్చు, గత ప్రభుత్వంలోని అధికారు ల నిర్లక్షాల మూలంగా ఏకంగా మెగావాట్ల విద్యుత్తు ఉత్ప త్తి ప్రక్రియ అందుబాటులోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరువురిపైనా ఆగ్రహం వ్యక్తం దాంతో ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయని కొందరు అధికారులు వివరించారు.

గత ప్రభుత్వం బిహెచ్‌ఈఎల్ కంపెనీకి సకాలంలో బిల్లులు  చెల్లించలేదని, దాంతో తాము కూడా సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోవడంతోనే పనుల్లో జాప్యం జరిగిందనే విషయాన్ని బిహెచ్‌ఈఎల్ అధికారులు డిప్యూటీ సీఎం ముందు వి వరించారని, అంతేగాక విద్యుత్తుశాఖాధికారు లు కూడా యాదాద్రి ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్స్‌లను సకాలంలో తీసుకురాలేకపోయారని, దాని మూలంగా కూడా యాదాద్రి ప్రాజె క్టు నిర్మాణాల్లో అంతులేని జాప్యం జరిగిందనే కీలకమైన విషయాలు బయటకొచ్చాయని ఆ అ ధికారులు వివరించారు. యాదాద్రి పవర్ ప్లాం ట్ నిర్మాణాల్లో జాప్యం జరగడం మూలంగా ఉ త్పత్తి ప్రారంభించడానికి వీలుకాలేదని, దాంతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని కోల్పోయినట్లయ్యిందని డిప్యూటీ సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాల ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించిన డిపూటీ సిఎం భట్టి విక్రమార్క విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవర ని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించడంతో నే వాగ్వివాదం చోటుచేసుకొందని వివరించారు. విద్యుత్తుశాఖకు, బిహెచ్‌ఈఎల్ కంపెనీకి మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్ల నిర్మాణాలు పూ ర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలేమిటని ఆయన నిలదీశారు. కారణాలు ఏమైనా నిర్మాణాలు ఏకంగా మూడేళ్ళపాటు జాప్యం జరగడంతో ఎంతో నష్టం వాటిల్లిందని డిప్యూటీ సిఎం మండిపడ్డారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో బిహెచ్‌ఈఎల్‌కు ఎందుకు పనులు అప్పగించారని డిప్యూటీ సీ ఎం విద్యుత్తుశాఖ అధికారులను నిలదీశారు.

యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జెన్‌కో రూపొందించిన అంచనాలు, బిహెచ్‌ఈఎల్ కో ట్ చేసిన రేటు, అప్పటి ధరల వివరాలు, బిహెచ్‌ఈఎల్‌తో జరిగిన సంప్రదింపులు, అంగ్రిమెంట్ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని డిప్యూటీ సిఎం ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న బిహెచ్‌ఈఎల్ తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్ లో వర్క్ ఆర్డర్ జారీ చేశారని, అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారం 20 21 నాటికి పనులన్నీ పూర్తికావాల్సి ఉందని, కా నీ పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క బిహెచ్‌ఈఎల్ అధికారులను ప్రశ్నించారు. అసలు ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదో తనకు తెలపండని ఆయన ఆదేశించారు.

భట్టి విక్రమార్క ప్రశ్నలకు బిహెచ్‌ఈఎల్ అధికారులు బదులి స్తూ…సకాలంలో తమకు బిల్లులను చెల్లించలేదని, ముఖ్యంగా విద్యుత్తుశాఖ అధికారులే ఈ ఆలస్యానికి కారణమని బిహెచ్‌ఈఎల్ అధికారులు డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఇ బ్బందులు సైతం జాప్యానికి కారణమని వారు డిప్యూటీ సిఎంకు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం జోక్యం చేసుకుని.. రూ. 34,500 కోట్ల పనుల్లో బిహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన పనుల విలువ ఎంత? అని ప్రశ్నించారు. బిహెచ్‌ఈఎల్‌కు రూ. 20,444 కోట్ల్ల విలు వ చేసే పనులు అప్పగించారని, మిగిలిన పనుల ను జెన్‌కో ఇతర సంస్థలు చేపట్టాయని ఈ సందర్భంగా బిహెచ్‌ఈఎల్ అధికారులు వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేయగా, రూ.14,400 కోట్ల చె ల్లింపులు చేశారన్నారు. ఇంకనూ రూ.1167 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వం చెల్లింపులు విడతల వారీగా చేయలేదని, 2023 మార్చి ఒక్క నెలలోనే 91 శాతం పేమెంట్ చేశారన్నారు. నిధులు సకాలం లో చెల్లించకపోవడంతో తాము సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేక పోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదని బిహెచ్‌ఈఎల్ అ ధికారులు వివరించారు. పర్యావరణ అనుమతులను ఏప్రిల్ 2024 నాటికి తీసుకువస్తే తాము సెప్టెంబర్ 2024 వరకు రెండు యూనిట్లు, డి సెంబర్ 2024 వరకు మరో రెండు యూనిట్లు, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారు డిప్యూటీ సిఎంకు వివరించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వి, బిహెచ్‌ఈఎల్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News