Friday, December 20, 2024

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నెల రోజుల హుండీ ఆదాయం రూ.2,66,68,787 వచ్చినట్లు ఆలయ ఇఒ భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం యాదాద్రి కొండ కింద గల వ్రత మండపంలో నారసింహుడి హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. నగదుతో పాటు 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండిని భక్తులు హుండీలో సమర్పించుకున్నట్లు ఆయన తెలిపారు.

అమెరికా 1354 డాలర్లు, ఆస్ట్రేలియా 60 డాలర్లు, యూఏఈ 50 దిరమ్స్, నేపాల్ 20 రూపాయలు, సౌదీ అరేబియా 203 రియల్, సింగపూర్ 4 డాలర్లు, కువైట్ 3 దినార్, ఖతార్ 102 రియల్, ఒమన్ 400 బైస, శ్రీలంక 200 రూపాయలు, కెనడా 170 డాలర్లు, న్యూజిలాండ్ 50 డాలర్లు, యూరోప్ 80 యూరో, కెన్యా 50 శిలాంగ్స్, ఈజిప్ట్ 5 పాండ్స్, కజకిస్థాన్ 20 కజకిస్థాన్, స్కాట్లాండ్ 5 స్టెర్లింగ్, థాయిలాండ్ 40 భట్, కంబోడియా 10,00,000 రిఎల్‌ను భక్తులు హుండీలో సమర్పించుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News