Saturday, December 21, 2024

యాదాద్రిలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -

యాదాద్రిలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి…
అన్ని దర్శనాలు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారానే బుకింగ్
తిరుమల తరహాలోనే యాదాద్రిలో బ్రేక్ దర్శనం టికెట్లు
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాల్లో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలతో దూర ప్రాంతాల భక్తులకు స్వామి వారి దర్శనం చాలా సులభంగా దొరుకుతోంది. బ్రహ్మోత్సవాల టికెట్లను సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను పొందాలనుకునే వారు yadadritemple.telangana. gov.in వైబ్‌సైట్‌లో సంప్రదించాలని ఆలయ అధికారులు సూచించారు.

తిరుకల్యాణ మహోత్సవం- టికెట్‌లు ఆన్‌లైన్‌లో
తిరుమల తరహాలోనే యాదాద్రిలో బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయిస్తున్నారు. ఒక్కోక్కరికీ టికెట్ ధర రూ.300, రూ.150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళాలిచ్చే వారి కోసం ఈ డొనేషన్ సదుపాయాన్ని (ఈ- హుండీ) కల్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం- 2023 టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ధర రూ.3వేలుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈనెల 28న తిరుకల్యాణం జరుగనుంది.

శాశ్వత నిత్య సహస్రనామార్చనకు రూ.15వేలు
వీటితో పాటు శాశ్వత నిత్యపూజ పదేళ్లకు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15వేలుగా నిర్ణయించారు. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్ ఏసికి రూ.560, లక్ష్మీనిలయం నాన్ ఏసి డీలక్స్ రూ.1000లుగా నిర్ణయించారు. స్కూటర్ పూజకు రూ.300లు, ఆటో పూజకు రూ.400లు, కారు పూజ రూ.500లు, బస్సు, లారీ, ట్రాక్టర్ పూజలకు రూ.1000లుగా నిర్ణయించారు. శయనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100, దర్బార్ సేవ రూ.516, అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800లు గా ఉంది.

ఇందులో నిజాభిషేకం (ఇద్దరికీ రూ.800, ఒక్కరికీ రూ.400), సహస్రనామార్చన రూ.300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ.1,250, స్వామి వారి కల్యాణం రూ.1,500లుగా నిర్ణయించారు. క్షేత్రాభివృద్ధిలో ఆలయ పునర్ నిర్మాణమయ్యాక అంచెలంచెలుగా ఈ సేవలు విస్తరించాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యాదాద్రీశ్వరుని దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాల్లో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News