Sunday, January 19, 2025

యాదాద్రి పవర్ స్టేషన్ అతి పెద్ద కుంభకోణం: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లాగ్‌బుక్కులను గత ప్రభుత్వం మాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం బిఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్దాలు ఆడారని మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి శాసన సభలో మాట్లాడారు. 29 వేల కోట్లతోని యాదాద్రి పవర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారని, తొమ్మిది ఏండ్లు దాటిని యాదాద్రి పవర్ స్టేషన్ ఎందుకు ముందుకు పడలేదని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ స్టేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అని కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. 24 గంటల కరెంట్ పచ్చి అబద్ధమని, ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా కరెంట్ పరిస్థితి తెలుస్తుందన్నారు. విద్యుత్ రంగంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, నేతలు దోచుకతిన్నారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News