శ్రీ లక్ష్మీనరసింహుడి రథోత్సవ
జాతర వైభవం
భక్తకోటి రక్షణకై ఊరేగిన
కల్యాణ మూర్తులు
శ్రీ మహావిష్ణు అలంకారుడిగా,
గరుడవాహన సేవలో దేవదేవుడి దర్శనం
నేడు చక్రతీర్థ మహోత్సవం,
దోపు ఉత్సవం
వైభవం వైభవం శ్రీ లక్ష్మీ
నరసింహుడి జాతర వైభవం.. లోకరక్షణకై కల్యాణ దంపతులు ఊరేగిన వైభవం.. జగత్ రక్షకుడిగా శ్రీ మహావిష్ణు అలంకార రూపుడిగా గరుడవాహన సేవలో భక్తకోటికి దర్శనమిచ్చిన వైభవం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల మహావైభవం..
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహుని బ్ర హ్మోత్సవాల జాతర ప్రతినిత్యము వైభవమే..తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రంగా జరుపుకుంటున్న బ్రహ్మోత్సవాల పండుగగా మక్కోటి భక్తులకు అన్ని తానై దర్శనమిచ్చిన నరసింహుడి అలంకార సేవలు భక్తకోటిని తరింపచేశాయి. శ్రీ లక్ష్మీనరసింహుడు పరిణయ మహోత్సవం జరుపుకొ ని లోకరక్షణ కోసం దివ్యవిమాన రథోత్సవంపై అత్యంత వైభవంగా ఊరేగిన జాతర కన్నుల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవార ం ఉదయం బాలాలయంలో శ్రీ విష్ణు సహస్త్రనామస్తోత్ర పారాయణములు గావించి, యజ్ఞాచార్యులు, పారాయణికులు పంచసూక్తములతో మూలమంత్ర జపములను నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన స్వామిఅమ్మవార్లను ప్రత్యేక అలంకార పూజలను నిర్వహించారు.
విష్ణుమూర్తి అలంకారంలో నరసింహుడు..
కల్యాణమూర్తులైన శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులను అ నుగ్రహించుటకు శ్రీమహవిష్ణు రూపుడి అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చాడు. లోక ర క్షకుడైన శ్రీమహావిష్ణువు రూపంలో గరుడవాహన సే వ లో బాలాలయంలో మేళతాళాల మధ్య వేదమంత్రాలు ఉ ఛ్ఛరణ చేస్తూ ఊరేగే తీరు దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం స్వామి గరుడవాహనంపై కొలువు తీరగా భక్తులు దర్శించుకొని తమ పాపలను తొలగి పుణితులయ్యారు. శ్రీవారి సేవను ఆలయ మండపంలోనికి కొలువుదీర్చి మంగళనీ
రాజనములు చేసి అలంకార విశిష్టతను అర్చకస్వాములు భక్తులకు తెలియజేశారు.
దివ్యవిమాన రథోత్సవం…
బాలాలయంలో సాయంకాలం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణములు, మూలమ్రంత, ప్రబంధ, పూ రాణ ఇతిహాస, భగవద్విషయము, శ్రీభాష్యము, క్షేత్రమహత్యము, పారాయణములు పారాయణికులచే గావించబడినాయి. లఘుపూర్ణాహుతి, మంత్రపుష్పపఠనములు పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీస్వామి వారి ఉ త్సవ సందర్భంగా శాస్త్రోక్తంగా రథోత్సవ వేడుకలను రధ ంగ హోమము, రథబలి నిర్వహించి భక్తుల దర్శనార్ధం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధారూడిని గావించారు.
కొండ కింద రథోత్సవ వైభవం..
స్వామివారి ఆలయ ప్రచార రథంతో భక్తజనల దర్శనా ర్ధం కొండకింద రథోత్సవ వైభవం ఘనంగా నిర్వహించా రు. కల్యాణ మూర్తులైన శ్రీ లక్ష్మీనరసింహులను నైనాన ందకరముగా ఆలంకరణ చేసి లోక రక్షణకోసం శ్రీవారి రథోత్సవంలో కొలువు దీర్చి మేళతాళాల, భాజాభజంత్రీ ల మధ్య మంగళవాయిద్యాలు, భక్తజనుల భజన కోలాటలతో భక్తల కోలాహల నడుమ స్వామివారి దివ్యవిమా న రథోత్సవ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ తిరువీధుల్లో ఎంతో ఆనందగా కొనసాగిన రథోత్సవ ఊరేగింపులో ఆశేష భక్తజనులు పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగుతూ కల్యాణమూర్తులను దర్శించికుని గోవిందా నరసింహ నామములను ఆలకించారు. కొండంత పండుగగా సాగిన ర థోత్సవ మహోత్సంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించగా భక్తులు, స్థానికులు, ఆలయ ఉ ద్యోగ సిబ్బంది పాల్గొని దర్శించుకున్నారు. ఈ ఉత్సవ సేవ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగ ల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాడూరి వెంకటచార్యులు, వేద పండితులు, అర్చకుల బృందం, చీఫ్ ఇన్ఫర్మేషన్ క మీషనర్ బుధ్ధ మురళి, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఉద్యోగ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు చక్రతీర్థ మహోత్సవం..
శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉద యం ఆలయంలో మహా పూర్ణాహుతి చక్రతీర్థ మహోత్స వం రాత్రికి పుష్పయాగము, దోపు ఉత్సవం పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. స్వామివారి ఉత్సవాలలో భా గమైన చక్రతీర్థ స్నానం ఉత్సవమునకు ఎంతో విషష్టత కలిగియున్నది.
శ్రీవారి నిత్యరాబడి 11.17 లక్షలు
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం స్వామివారి ని త్యరాబడిలో భాగంగా మంగళవారం రోజున 11 లక్షల 17 వేల 602 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆల య కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. ప్రధాన బుకిం గ్, శ్రీఘ్రదర్శనం, వ్రతాలు, కళ్యాణ కట్ట, ఎంక్వైరీ, ప్ర సాదాలు, వాహన పూజల ద్వారా శాఖల వారిగా ఆదా యం వచ్చినట్లు అధికారులు తెలిపారు.