Saturday, December 21, 2024

యాదాద్రి హుండి ఆదాయం కోటి 78 లక్షలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి ః యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామి వారి ఆలయ హుండి లెక్కింపు నిర్వహించారు. గురువారం రోజున 16 రోజుల హుండి లెక్కింపులో రూ.1,78,52,446 ( 1 కోట్ల 78 లక్షల,52 వేల,446) రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రకటనలో తెలిపారు. ఈ హుండి లెక్కింపులో మిశ్రమ బంగారం 0.086.000(86) గ్రాములు, మిశ్రమ వెండి 03,500,000 (3 కేజీల 500 గ్రాములు) గ్రాములు వచ్చాయి.

హుండీలో విదేశీ రూపాయలు అమెరికా 664 డాలర్లు, ఆస్ట్రేలియా 10 డాలర్లు, కెనడా 70 డాలర్లు, యూఏఈ 5 దిరామ్స్, ఒమాన్ 6001/2 బైసా, కతార్ 1, యూరప్ 25,బుటాన్ 1,సౌతాఫ్రీక 100,బంగ్లాదేశ్ 10,జపనీస్ 1000,నేపాల్ 10, సిరియా 5000 తదితర దేశాల భక్తుల నుండి కానుకల రూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ ఆలయ ఉండి లెక్కింపు ఆలయ ఈఓ గీత, దేవాదాయ శాఖ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగగా ఆలయ ఉద్యోగ సిబ్బంది తదితరులు ఈ హుండి లెక్కింపులో పాల్గొన్నారు.
నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రోజున రూ.23,71,626 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News