Monday, January 20, 2025

యాదాద్రి క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా ఆకు పూజలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మి నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర క్షేపనం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు.

పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయాలలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం వచ్చిన భక్తులు యాదాద్రి క్షేత్రములో నిర్వహించిన నిత్యపూజలు సుప్రభాతం,అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, పుష్పర్చన, జోడి సేవ తదితర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజలతోపాటు, కొండపైన కోలువు దీరిని శివాలయంలో శివుడిని దర్శించుకొని భక్తులు పూజలు చేశారు. శ్రీవారి అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులు అర్జిత సేవ పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు….

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ఐఏఎస్‌లు, హైకోర్టు జడ్జి ఒకేరోజు వేరువేరుగా ప్రముఖులు దర్శించుకోని పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని జిహెచ్‌ఎంఎస్ కమిషనర్ (ఐఏఎస్) సంతోష్ దర్శించుకోని పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు శ్రీ స్వామి వారి ఆశీర్వచనము అందచేశారు. సాయంత్రము ఛతీస్‌గడ్ రాయ్‌ఘర్ జిల్లా కలెక్టర్ రానుసాహు శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనము చేసి తీర్ధ ప్రసాదమును అందచేశారు. హైకోర్టు జడ్జి ఎ. సంతోష్‌రెడ్డి శ్రీ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోని పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు జడ్జికి శ్రీ స్వామివారి ఆశీర్వచనము చేయగా, ఆదికారులు ప్రసాదమును అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News