యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 48 రోజుల హుండీ ఆదాయం రూ.4,17,13,596 వచ్చినట్లు ఆలయ ఇఒ భాస్కర్‌రావు తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట కొండ కింద గల వ్రత మండపంలో స్వామి, అమ్మవార్ల హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. ఆదాయంతో పాటు 228 గ్రాముల బంగారం, 7 కిలోల 50 గ్రాముల వెండిని హుండీలో భక్తులు సమర్పించుకున్నట్లు తెలిపారు. 1721 అమెరికా డాలర్లు, 195 ఆస్త్రేలియా డాలర్లు, 40 ఇంగ్లాండ్ పౌండ్స్ , 490 యూఏఈ దిరమ్స్,
110 నేపాల్ రూపీస్, 39 సౌదీ అరేబియా రియల్, 62 సింగపూర్ డాలర్లు, 12 ఖతార్ రియల్, 702 ఒమన్ బైస, 15 కెనడా డాలర్స్, 122 మలేషియా రింగ్గిట్స్, 1000 కొరియా వన్, 170 బంగ్లాదేశ్ టక్కా, 1000 ఫిలిప్పీన్స్ పెనో, 270 శ్రీలంక రూపీ, 25 జార్జియా, 20 థాయిలాండ్ బహట్, 1000 ఇండోనేషియా రూపీయా, 100 గయాన డాలర్స్, 15 యూరో, 100 హాంగ్‌కాంగ్ డాలర్లను భక్తులు హుండీలో సమర్పించుకున్నట్లు తెలిపారు.