Monday, December 23, 2024

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.కోటి 85 లక్షలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. మంగళవారం 19 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,85,96,202 ( 1 కోటి 85 లక్షల, 96 వేల, 202) రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో మిశ్రమ బంగారం 159 గ్రాములు, మిశ్రమ వెండి 7 కేజీల 300 గ్రాములు వచ్చాయి.

హుండీలో విదేశీ రూపాయలు అమెరికా 1249 డాలర్లు, ఆస్ట్రేలియా 150 డాలర్లు, కెనడా 5 డాలర్లు, యూఏఈ 65దిరామ్స్, ఒమాన్ 1 బైసా, కతార్ 2, యూరప్ 30, ఇండోనేషియా 50,000, కువైట్ 1 1/2, బహరైన్ 1/2 భక్తులు కానుక రూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ ఆలయ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ గీత, దేవాదాయ శాఖ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగగా ఆలయ ఉద్యోగ సిబ్బంది తదితరులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

నిత్యరాబడి..
స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రూ.15,99,166 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News