ఎలిగేడు: మండలంలోని రాములపల్లి గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గురువారం ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను యాదవ సంఘం నాయకులు, లబ్దిదారులు గొంగళి కప్పి, గొర్రె పిల్లను బహుకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యాదవుల పాత్ర గొప్పదని, ఆ ర్థికంగా ఎదిగేందుకు గొర్రెల పంపిణీ పథకం ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, మరోసారి సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ప్రతి ఒక్కరు నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక రాజనర్సు, ఫ్యాక్స్ చైర్మన్ గోపు విజయ భాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్ రావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మాడ కొండాల్ రెడ్డి,సర్పంచ్‌లు చిలుమలు సౌమ్య లక్ష్మణ్, ఎంపీటీసీ ప్రేమలత కమలాకర్ రెడ్డి,
అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు కప్పల ప్రవీణ్, సమ్మయ్య, న్యాతరి పోచాలు, ఉపసర్పంచ్ కోమలత, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, సిద్ది తిరుపతి, గ్రామ అధ్యక్షుడు కనకయ్య, యాదవ సంఘ అధ్యక్షుడు రామస్వామ, సంజీవరెడ్డి, నరేష్, కొమురయ్య, కోమల్ రెడ్డి, పున్నం, విజయ్, సంపత్, రమేష్, మహేష్, మండల నాయకులు తిరుపతి, విజయ్, భూమేష్, కుమార్‌తోపాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.