Monday, January 20, 2025

యమధీర చిత్రంలో క్రికెటర్ శ్రీశాంత్

- Advertisement -
- Advertisement -

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు , ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్నకుమార్, కోశాధికారి రామసత్యనారాయణ , నిర్మాత డి. ఎస్. రావు , పి. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “యమధీర” సినిమాను ఈవీఎం ట్యాంపరింగ్‌పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ దేశంలో ఎక్కువ శాతం షూట్ చేశాము”అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News