Tuesday, January 21, 2025

‘యమధీర’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నటులు, నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే యమధీర సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ “కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా సినిమాలో చూపించే అవకాశం ఉంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News