Monday, December 23, 2024

యమహా నుంచి 125సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆహ్లాదకరమైన సవారీ అనుభవాలను అందించడం కొనసాగిస్తూ, ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు ఆహ్లాదకరమైన, ఫీచర్‌ ప్యాక్డ్‌ 2023 శ్రేణి 125 సీసీ స్కూటర్‌ శ్రేణి విడుదల చేసింది. దీనిలో ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌,రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ మరియు రేజెడ్‌ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ ఉన్నాయి.

కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాలనే భారతదేశపు లక్ష్యానికి అనుగుణంగా ఈ 2023 వెర్షన్‌ యయహా యొక్క 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణి ఇప్పుడు ఈ20 ఫ్యూయల్‌ ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ను కలిగి ఉంది. అంతేకాదు, ఈ నూతన ఇంజిన్‌ ఓబీడీ2 ప్రమాణాలను సైతం కలిగి ఉంది.

ఈ మొత్తం 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణి లో యమహా విప్లవాత్మక బ్లూ టూత్‌ ఆధారిత వై– కనెక్ట్‌ యాప్‌ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌) ఉంది. ద్విచక్ర వాహనాలకు నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తూ , యమహా కనెక్ట్‌ యాప్‌ పలు సౌకర్యవంతమైన ఫీచర్లను సైతం కలిగి ఉంది. దీనిలో ఇంధన వినియోగట్రాకర్‌, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్‌ లొకేషన్‌, మాల్‌ఫంక్షన్‌ నోటిఫికేషన్‌, రైడర్‌ ర్యాంకింగ్‌ మరియు మరెన్నో ఉంటాయి.

వీటితో పాటుగా 2023 శ్రేణి యమహా 125 హైబ్రిడ్‌ స్కూటర్లు అసాధారణ రంగులతో రావడంతో పాటుగా భారతీయ వినియోగదారుల నడుమ ఆసక్తిని రేకిత్తించే శైలిని కలిగి ఉన్నాయి.

యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ ‘‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ ప్రచారం కింద మా వినియోగదారులకు అసాధారణ అనుభ వాలను అందించాలన్నది మా ప్రయత్నం. భారతదేశంలో స్కూటర్‌ విభాగంలో పోటీ అధికంగా ఉండటంతో పాటుగా వినియోగదారుల అంచనాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ ద్విచక్ర వాహన సంస్ధగా మోటర్‌సైకిల్స్‌కు ఆవల 2023 వెర్షన్‌ మా 125సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌శ్రేణితో అత్యున్నత అనుభవాలను అందించనున్నాము. భారతీయ వినియోగదారుల అంచనాలను సరికొత్త ఫీచర్లు, రంగులతో అందుకోగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News