Monday, December 23, 2024

హైదరాబాద్‌లో యమహా ట్రాక్ డే ఈవెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియా యమహా మోటర్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్, తన వినియోగదారుల కోసం నవంబర్ 4-5, 2023 తేదీలలో హైదరాబాద్‌లోని షామీర్‌పేట్‌లోని చికేన్ సర్క్యూట్‌లో ప్రత్యేకమైన ట్రాక్ డే ఈవెంట్‌ను నిర్వహించింది. ఉత్తేజకరమైన “ది కాల్ ఆఫ్ ది బ్లూ” బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. హైదరాబాద్, సమీప ప్రాంతాల నుండి దాదాపు 200 మంది యమహా యజమానులు, 500 కంటే ఎక్కువ మంది యమహా అభిమానుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం సాక్ష్యమిచ్చింది, ఇది అసాధారణ విజయాన్ని సాధించింది.

హైదరాబాద్‌లోని షామీర్‌పేట్‌లోని అత్యాధునిక చికేన్ సర్క్యూట్‌లో నిర్వహించిన ట్రాక్ డే ఈవెంట్ యమహా యజమానులకు, తమ స్వంత యమహా మోటర్‌సైకిళ్లను నడుపుతూ థ్రిల్‌ను అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని అందించింది. యమహా ట్రాక్ డేలో పాల్గొనేవారు లీన్ యాంగిల్స్, హై-స్పీడ్ కార్నరింగ్, ఖచ్చితమైన బ్రేకింగ్, బాడీ మూవ్‌మెంట్ యొక్క డైనమిక్స్‌ను అన్వేషించే అవకాశాన్ని పొందారు, అదే సమయంలో వారి మెషీన్‌లలో అందుబాటులో ఉన్న క్విక్ షిఫ్టర్‌లు మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ల వంటి అధునాతన ఫీచర్‌ల ప్రయోజనాలను కూడా తెలుసుకోగలిగారు.

అదనంగా, ప్రేక్షకులు తమ ట్రాక్-ఫోకస్డ్ పనితీరు, అత్యాధునిక సాంకేతికతకు పేరుగాంచిన ప్రస్తుత R సిరీస్ మోటర్‌సైకిళ్ల యొక్క మంత్రముగ్దులను చేసే ప్రదర్శనతో అలరించారు. మరోవైపు MT సిరీస్ సమున్నతంగా నిలిచింది, పట్టణ రైడర్‌లలో నిబద్దత తో కూడిన అభిమానాన్ని సంపాదించుకున్న ఈ సిరీస్ మాస్క్యులర్, దూకుడు స్ట్రీట్‌ఫైటర్‌ల శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఇక్కడితో అయిపోలేదు, ఔత్సాహికులు రాబోయే YZF-R3, MT-03లలో ప్రత్యేకమైన ఫీచర్స్ ను ఆస్వాదించే అవకాశం కూడా పొందారు, యమహా ఇండియా లైనప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండు జోడింపులు వారి సంబంధిత వర్గాలలో పనితీరు, శైలి యొక్క ప్రమాణాలను పునర్నిర్వచించగలవని వాగ్దానం చేస్తాయి.

ట్రాక్ డే ఈవెంట్ యమహా కస్టమర్‌లు తమ మోటర్‌సైకిళ్ల యొక్క నిజమైన సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి, ట్రాక్ రైడింగ్, సాధారణ రోడ్ రైడింగ్ మధ్య తేడాలపై విలువైన పరిజ్ఞానం పొందేందుకు అనుమతించింది. బలమైన రేసింగ్ వారసత్వంతో అద్భుతమైన బ్రాండ్‌గా తమ గ్లోబల్ ఇమేజ్‌ని నెలకొల్పడానికి, వినియోగదారులకు గౌరవం, స్వంతం అనే భావాన్ని అందించదానికి యమహాచే నిర్వహించబడిన అనేక ప్లాట్‌ఫారమ్‌లలో ట్రాక్ డే ఈవెంట్ ఒకటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News