Wednesday, January 22, 2025

యమున నీటి మట్టం నేడు 205 మీటర్ల స్థాయికి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారీ వర్షాలతో యమునా నది ఇప్పుడు రాజధాని ఢిల్లీ, హర్యానాలలో దాదాపుగా ప్రమాదకర సూచీని దాటుతోంది. ఎగువ ప్రాంతాలల్లో భారీ వర్షాలతో ఇప్పటికే నిండిన హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని నదిలోకి వదిలారు. లోతట్టు ప్రాంతాల వారికి ఇది పెను ముప్పుగా మారింది. అధికారులు వెలువరించిన ఫ్లడ్‌బులెటిన్ ప్రకారం సోమవారం ఉదయం ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం దాదాపుగా 203.58 మీటర్లకు చేరింది. ఇక్కడ డేంజర్ సిగ్నల్ మట్టం 204.5 మీటర్లు. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం 205.33 స్థాయికి చేరుకుంటుందని అంచనావేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News