Thursday, January 23, 2025

మరోసారి ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తున్న యమున

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని యమునానది బుధవారం ప్రమాదస్థాయి 205 .33 మీటర్లు దాటి 206 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. ఇంకా స్థాయి పెరిగి మరింత ఉధృతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్లుసి) వివరాల ప్రకారం పాతరైల్వేబ్రిడ్జి (ఒఆర్‌బి) వద్ద బుధవారం ఉదయం 205.09 మీటర్ల స్థాయిలో యమున ప్రవహించింది. ఈనెల 13న ఈ బ్రిడ్జి దగ్గర 208 మీటర్ల ప్రమాదకర స్థాయి దాటి నది ప్రవహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో చేరుకుంటుందని భయపడుతున్నారు.

ఆదివారం నాడు హర్యానా లోని హత్నీకుండ్ బ్యారేజీ నుంచి వరద నీరు విడుదలై రావడంతో మరోసారి యమున నీటి మట్టం ప్రమాదస్థాయి మించి ప్రవహించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లోని ప్రధాన వాతావరణ కేంద్ర ం సఫ్దర్‌గంజ్ అబ్జర్వేటరీ బుధవారం ఉదయం 8.30 గంటల సమయానికి గత 24 గంటల్లో 27.1 మిమీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. లోథి రోడ్, అయానగర్, ముంగేష్‌పూర్, మయూర్ విహార్, ప్రాంతాల్లో క్రమంగా 35.1 మిమీ, 26 మిమీ, 53.5 మిమీ , 110.5 మిమీ వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News