Monday, December 23, 2024

బిసిల ఆస్తులను లాక్కున్నది వైసిపోళ్లే: యనమల

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిసిల విషయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డిది కొంగ జపం అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సోమవారం యనమల మీడియాతో మాట్లాడారు. తడిగుడ్డలతో గొంతులు కోస్తూ తోడుగా ఉన్నాననడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. బిసిల ఆస్తులను లాక్కుని వారి సమాధులపై సిఎం అవినీతి సౌధాలు నిర్మాణం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసిపి నేతల దోపిడీకి బలవుతున్నది బిసిలేనని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిల నుంచి దాదాపుగా 12 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను లాక్కున్నారని, అర్హత ఉన్నప్పటికీ బిసిలకు సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని యనమల ధ్వజమెత్తారు. సబ్ ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లు దారి మళ్లించారని, రిజర్వేషన్ల విషయంలో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని అడిగారు.

Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News