Monday, December 23, 2024

నా బయోగ్రఫీ యండమూరి రాస్తారు: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్, నటుడు నాగేశ్వర్ రావు తనకు దైవ సమానులు అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వారితో కలిసి నటించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. వైజాగ్‌లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్‌ఆర్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి అతిథిగా వచ్చారు. ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్‌తో కలిసి ఉన్న అనుభవాలు గుర్తు చేశారు. ఆ మహానటులతో కలిసి నటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకు లేకపోవడంతో యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించానని వివరించారు. సమకాలిన రచయితలతో యండమూరికి సాటి లేరన్నారు. యండమూరి రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో తన పదిలం చేసుకున్నానని చిరు గుర్తు చేశారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. జగదేక వీరుడు అతిలోకి సుందరి, అంజి సినిమాల తరువాత తరువాత ఫాంటసీ డ్రామాలో తెరకెక్కిస్తున్న సినిమాలో చిరు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News