Saturday, November 23, 2024

పంట కాలం ముందుకు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు కావటంతో వ్యవసాయరంగం స్వరూపమే మారిపొయిందిని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. వ్యవసాయరంగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో భేటీ అ యింది. మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో వ్య వసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. యాసంగి వరి పంటకోతల ఆలస్య కారణంగా అకాల వర్షాలతో జరిగే పంట నష్టం రైతులకే కాకుండా ఆ ప్రభావం ప్రభుత్వంపైన కూడా పడుతోంది. ఈ నష్టాలను నివారించడానికి గత మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రై తుల నష్టాలను నివారించడానికి అవసరమైన సాధ్యా సా ధ్యాలను పరిశీలన చేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘా న్ని నియమించారు. ఈ ఉపసంఘం వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని తెలిపారు.

సాగు నీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మస్థయి ర్యం పెరిగిందన్నారు. కాని యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో జరిగే నష్టం రైతు కే కాదు ప్రభుత్వానికి కూడా నష్టమే అని పేర్కొన్నారు. యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వీటిపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. యాసంగి సాగులో యాజమాన్య పద్ధ్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగుపై , ఇతర అంశాలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో విస్తృత చర్చంచినట్టు తెలిపారు. తదుపరి సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించినట్టు మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులుగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News