Monday, December 23, 2024

యాసంగి…గోసంగి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజికి చేరువవుతున్నాయి. జలాశయాల్లో నీటి నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణపు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టుల కింద చాలినంత నీరు లేకపోవటం తో ప్రభుత్వం సాగునీటి విడుదలపై చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడిం ది. నాగార్జున సాగర్ , కడెం తదితర ప్రాజెక్టుల కింద క్రాప్‌హాలీడే లు ప్రకటించాల్సి వచ్చింది. సాగుచేసిన పైర్లు చేతికందాలంటే మ రో రెండు నెలల పాటు నీటి తడులు అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు ఆయకట్టును కాపాడుకునేందుకు సరిపోతాయా లేదా అన్న దానిపై సందేహాలు నెలకుంటున్నాయి. పలు ప్రాజెక్టుల కింద ఆయకట్టు చివరిభూముల్లో సాగు చేసిన పంటలకు చివరి నీటితడులు అందుతాయన్న న మ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పె ట్టి సాగు చేసిన పైర్లను చివరి దాకా కాపాడుకోవటం ఎలాగా అని రైతులు మధన పడుతున్నారు.

ప్రాజెక్టుల కింద ఆయకట్టు మాటే గాని.. అత్యధికశాతం పంటలు బోర్ల కిందనే సాగుచేశారు. మరో వైపు రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు కూడా వేగంగా దిగజారి పో తున్నాయి. పలు జిల్లాల్లో ప్రత్యేకించి దక్షిణ , సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు సాధారణ స్థాయికంటే ఒకటి నుం చి ఒకటిన్నర మీటర్ల లోతుకు పడిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ ఇప్పటికే యాసంగి పంట సాగు విస్తీర్ణపు లక్ష్యాలపై ప్రభావం చూపుతున్నాయి. యాసంగిలో ప్రతికూ ల పరిస్థితుల ప్రభావం వరిసాగు లక్ష్యాలను దెబ్బతీసింది. గత ఏ డాది యాసంగిలో ప్రధాన ఆహార ధాన్యపంటలు ,నూనెగింజపంటలు ,పప్పుధాన్యపంటలు ఇతర మరికొన్ని వాణిజ్యపంటలు కలి పి 66లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. అయితే ఈ సారి యాసంగి సాగు విస్తీర్ణం లక్ష్యాల్లో గత ఏడాది యాసంగితో పొలిస్తే 5లక్షల ఎకరాల మేరకు గండి పడింది. మొత్తం విస్తీర్ణం 60.88లక్షల ఎకరాల వద్దనే ఆగిపోయింది. ప్రత్యేకించి వరిసాగు లక్ష్యాలు గుల్లబారాయి. గత ఏడాది యాసంగిలో 51లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ సారి ప్రాజెక్టుల్లో నీటినిలువలు తగినంత లేకపోవటం, నీటివిడుదలకు ముందుగానే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టులో క్రాప్‌హాలిడేలు ప్రకటిచటం తదితర కారణాలు వరిసాగు లక్ష్యాలను దెబ్బతీశాయి. రాష్ట్రంలో వరినాట్లు 46లక్షల ఎకరాల వద్దనే ఆగిపోయాయి. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా గత యాసంగితో పోలిస్తే లక్ష ఎకరాల మేరకు విస్తీర్ణం పడిపోయింది. మొత్తంగా ఆహార ధాన్య పంటల సాగు విస్తీర్ణంలో 5లక్షల ఎకరాల మేరకు గండి పడింది.నూనె గింజ పంటల సాగులో కూడా గత యాసంగి కంటే ఈ సారి విస్తీర్ణం 40వేల ఎకరాల మేరకు తగ్గిపోయింది.

ఆందోళన గొలుపుతున్ననీటి నిల్వలు
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో తరగిపోతున్న నీటి నిల్వలు వ్యవసాయరంగంలో ఆందోళన పుట్టిస్తున్నాయి. కృష్ణానదీ పరివాహకంగా వర్షాలు ఆశించిన రీతిలో లేకపోవటం, ఎగువన కర్ణాటక నుంచి నీటి ప్రవాహాలు 160టిఎంసీలకు మించకపోవటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఈ సారి కళతప్పాయి.జూరాల ప్రాజెక్టులో నీటినిల్వలు 4.46టిఎంసిలకు చేరుకున్నాయి. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి ఆయకట్టులో సాగు చేసిన పంటల పరిస్థితి బిక్కుబిక్కుమంటోంది. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 818అడుగులకు పడిపోయింది. నీటినిలువ కూడా గత ఏడాది ఈ సమయానికి 53టిఎంసీలు ఉండగా, ప్రస్తుతం ఇందులో నీటినిలువ 38 టిఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ పరిస్థితి మరింత ఆందోళన గొలుపుతోది. గత ఏడాది ఈ ప్రాజెక్టులో ఈ సమయానికి 557 అడుగుల వద్ద 225టిఎంసీల నీరు నిలువ ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నీటిమట్టం 516అడుగులకు పడిపోయింది. నీటి నిలువ కూడా 143టిఎంసీలకు చేరుకుంది. సాగర్ ఆయకట్టులో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 7లక్షల ఎకరాల ఆయకట్టుకు 3.2లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. ఏఎంఆర్‌పి ప్రాజెక్టు కింద సుమారు రెండు లక్షల ఎకరాలు పంటల సాగు లేక బీళ్లుగానే ఉంచాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు జీవధారగా ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పధకం ఈసారి కష్టాల్లో పడింది. మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటనలో దాని ప్రభావం యాసంగిలో 13జిల్లాలపై పడింది. మేడిగడ్డ నుంచి నుంచి ప్రాణహిత నదీజలాల ఎత్తిపోత ఆగిపోయింది. అన్నారం బ్యారేజి ఖాళీ అయింది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిలువలు సగానికి సగం తగ్గిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News