Monday, December 23, 2024

యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది

- Advertisement -
- Advertisement -

Yasangi grain is purchase by Telangana government

హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుంచే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News