Sunday, January 19, 2025

700 మంది అభిమానులతో సెల్ఫీ దిగిన యశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ కన్నడ నటుడు యష్ KGFయొక్క రెండు విడతలతో బాక్సాఫీస్‌ను శాసించాడు. KGF చాప్టర్ 1 మరియు KGF చాప్టర్ 2 యొక్క అద్భుతమైన విజయంతో, అతని క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగి ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటివల జరిగిన ఓ కార్యక్రమానికి యశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.యశ్ ను చూడడానికి అభిమానులు చాలా మంది వచ్చారు. అభిమానులు హీరో యశ్ తో పోటో దిగాలని నిర్వహకులను అడగగా,గ్రూప్ పోటో దిగడానికి వారు అనుమతిచ్చారు.

కానీ యశ్ అక్కడికి వచ్చిన అభిమానులతో మాట్లాడి గ్రూప్ పోటో కాకుండా ప్రతి ఒక్కరితో విడిగా 700 మందితో సెల్పీలు దిగారు.ఈవెంట్ సందర్భంగా ఆయనను కలిసిన అభిమానులు ఆయన వినయాన్ని చూసి ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. స్టార్‌ని కలిసిన వారి అనుభవాలను పంచుకోవడానికి వారు సోషల్ మీడియాకలో పోస్ట్ చేశారు. వారిలో ఒకరు ఇలా అన్నారు “ ఇది అద్భుతమైన క్షణం.. అతను నిజమైన సూపర్ స్టార్” అని అన్నారు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News