Saturday, December 21, 2024

బ్యాకప్ బౌలర్‌గా యశ్ దయాళ్!

- Advertisement -
- Advertisement -

ముంబై: త్వరలో జరిగే ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్ ట్రోఫీ కోసం ఉత్తర ప్రదేశ్ యువ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌ను బ్యాకప్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని యశ్ తండ్రి చందర్‌పాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై బిసిసిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, యశ్ దయాళ్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో కూడా జట్టుకు ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న యశ్ దయాళ్‌కు టెస్టు టీమ్‌లో ఛాన్స్ లభించింది. కానీ అతనికి అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, సుదీర్ఘ రోజుల పాటే సాగే బోర్డర్‌గవాస్కర్ సిరీస్ కోసం యశ్‌ను ముందు జాగ్రత్తగా బ్యాకప్ బౌలర్‌గా ఎంపిక చేసినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News