Thursday, January 23, 2025

తమిళ డైరెక్టర్‌తో నెక్ట్స్ మూవీ?

- Advertisement -
- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కెజిఎఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా నిలిచాడు. అయితే ఈ స్టార్ హీరో నెక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఎవరితో ఉంటుంది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. దీనికి నిర్మాత అయితే ఓకే అయ్యారు కానీ ఇంకా దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.

అయితే యష్ తమిళ్ దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి అనుగుణంగా తమిళ టాలెంటెడ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌తో అతను వర్క్ చేయనున్నట్టుగా తెలిసింది. ఇక, ఇది కూడా భారీ పాన్ ఇండియా సినిమా అన్నట్టు సమాచారం. అయితే ఇది యష్ 19వ సినిమానా లేదా మరో సినిమానా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News