సమంతని వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఆమె కెరీర్ మాత్రం వేగంగా దూసుకుపోతూ ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ సిరీస్ ‘ఫ్యామిలీమ్యాన్ 2’తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంత ఆ తరువాత హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించి షాకిచ్చింది. ఆతర్వాత ఎంతో వేదనకు గురైన సామ్ తన స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసింది. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న సామ్ భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ మూవీని పూర్తి చేసి తాజాగా ‘యశోద’లో నటిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ తాజాగా మరో సారి ‘ఫ్యామిలీమ్యాన్’ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతకు ఓ క్రేజీ ఆఫర్ ఇవ్వడమే కాకుండా ఆమెతో బిగ్ డీల్‌ని కుదుర్చుకున్నట్టు తెలిసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సమంతతో మూడు చిత్రాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుందట. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తయిన తరువాత యష్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాల్లో సమంత నటించనుందని తెలిసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ మూడు చిత్రాలకుగానూ సమంత భారీ పారితోషికం డిమాండ్ చేసిందని అందుకు వారు కూడా సానుకూలంగానే స్పందించారట. ఇదే నిజమైతే సామ్ కెరీర్ మరో దశ తిరిగినట్టే.