Wednesday, January 22, 2025

యశస్వి జైశ్వాల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులకే అవుట్ కావడంతో వన్ డౌన్ లో వచ్చిన శుభమన్ గిల్ తో కలసి యశస్వి చక్కగా ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఇద్దరూ కలసి చకచకా పరుగులు తీస్తూ సెంచరీ భాగస్వామ్యం పూర్తి  చేశారు. యశస్వి 133 బంతుల్లో 104 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం గిల్ 64 పరుగులతోను, కుల్దీప్ యాదవ్ 3 పరుగులతోనూ ఆడుతున్నారు. యశస్వి తరవాత వచ్చిన రజత్ పటీదార్ డకౌట్ అయ్యాడు. టామ్ హర్ట్ లీ వేసిన బంతిని రెహాన్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు 50 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News