Sunday, December 22, 2024

రికార్డు సృష్టించిన జైస్వాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టి20ల్లో రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టి20లో రెండో బంతుల్లో రెండు సిక్స్‌లు బాది ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే బౌలర్ సికందర్ రాజా వేసిన తొలి బంతిని స్టాండ్‌లోకి పంపించాడు. అది ఎంపైర్ నోబాల్‌గా ప్రకటించడంతో మళ్లీ ఆ బంతి సిక్స్‌గా మలచడంతో ఈ ఫిట్‌ను సాధించాడు. 2022లో రువాండాతో జరిగిన టి20 మ్యాచ్‌లో టాంజానియా బ్యాటర్ ఇవాన్ సెలెమానీ మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన రికార్డు అతడిపై ఉంది. జింబాబ్వేతో నాలుగో టి20లో 93 పరుగులు చేసి చివరలో జైస్వాల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న టి20 సిరీస్ ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News