Wednesday, December 25, 2024

జైస్వాల్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్ తొలి టెస్టులో యశస్వి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లియన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది యశస్వి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో గతంలో మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) పేరిట ఉన్న 33 సిక్సర్ల రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. యశస్వి ఇప్పటి వరకు 34 సిక్సర్లు బాది నయా చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News