టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ 4 బౌండరీలు బాది 16 పరుగులు రాబట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలోనే అతను వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల రికార్డ్‌ను వెనక్కి నెట్టాడు.
2005లో కోల్‌కతా టెస్ట్‌లో సెహ్వాగ్ తొలి ఓవర్‌లో 13 పరుగులు చేశాడు. 2023లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ వేసిన తొలి ఓవర్ లో రోహిత్ 13 పరుగులే చేసి సెహ్వా గ్ రికార్డ్ సమం చేశాడు. తాజా మ్యా చ్‌లో యశస్వి ఈ ఇద్దర్నీ అధిగమించాడు. స్టార్క్ వేసిన తొలి బంతిని డాట్ చేసిన యశస్వి జైస్వాల్.. షార్ట్ పిచ్‌గా వచ్చిన రెండో బంతిని స్లిప్ కార్డన్ మీదుగా బౌండరీ తరలించా డు. మూడో బంతిని కూడా స్టార్క్ బౌన్సర్‌గా సంధించగా.. జైస్వాల్ బౌండరీ కొట్టాడు. నాలుగో బంతిని లేట్ కట్‌తో బౌండరీగా తరలించాడు. హ్యా ట్రిక్ బౌండరీల తర్వాత డాట్ బాల్ ఆడిన యశస్వి.. చివరి బంతిని కూడా బౌండరీ కొట్టి 16 పరుగులు సాధించాడు.