Friday, November 22, 2024

యశస్వికి ఐసిసి అవార్డు

- Advertisement -
- Advertisement -

దుబాయి: టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. యశస్వి ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో యశస్వి పరుగుల వరద పారించాడు. ఏకంగా 712 పరుగులు సాధించి ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు.

అంతేగాక సునీల్ గవాస్కర్ తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా యశస్వి నిలిచాడు. యశస్వి సంచలన బ్యాటింగ్ ప్రతిభకు గుర్తింపుగా అతనికి ఫిబ్రవరి నెలకుగానూ ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ పురస్కారం వరించింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశాంకలను వెనక్కి నెట్టి యశస్వి ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు దక్కడంపై యశస్వి ఆనందం వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో ఇంగ్లండ్ సిరీస్ చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. రానున్న రోజుల్లో కూడా మెరుగైన బ్యాటింగ్‌తో భారత్‌కు అండగా నిలుస్తాననే నమ్మకాన్ని యశస్వి వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News