హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబయి జట్టును వీడాడు. ముంబయిని వీడి గోవా జట్టులో చేరుతానని యశస్వి జైస్వాల్ ప్రకటించాడు. ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. గోవా నుంచి తనకు మంచి ఆఫర్ రావడంతో మారనని జైస్వాల్ వివరణ ఇచ్చాడు. తాజాగా యశస్వి జైస్వాల్ మీడియాలో మాట్లాడారు. జీవితాంత ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు రుణపడి ఉంటానని టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. ముంబయి నగరమే తనన ఇలా మార్చిందని, ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. గోవా తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చిందని, నాయకత్వ పాత్ర పోషించాలని అడిగిందని, అందుకే గోవా జట్టులో వెళ్తున్నానని ప్రకటించాడు. తొలి ప్రాధాన్యం మాత్రం టీమిండియా జట్టుకే ఇస్తానని, జాతీయ జట్టుకు ఆడనప్పుడు మాత్రమే గోవా తరుపున ఆడాతానని స్పష్టం చేశాడు. తనకు వచ్చి ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నానని జైస్వాల్ ధీమా వ్యక్తం చేశారు.
నాకు ఆఫర్ రావడంతో గోవాకు మారాను: జైస్వాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -