Sunday, January 19, 2025

టాప్ టెన్‌లోకి యశస్వి

- Advertisement -
- Advertisement -

రోహిత్, కోహ్లీలకు మెరుగై ర్యాంకు
బౌలింగ్‌లో అగ్ర స్థానంలో బుమ్రా

దుబాయ్ : టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ యశస్వి జైస్వాల్ టాప్ టెన్‌లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో కట్టుకున్న యశస్వి ఐసిసి ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 10వ స్థానానికి ఎగబాకాడు. ఇక టీమిండియా సారధి రోహిత్ శర్మ సయితం రెండు స్థానాలు మెరుగు పరుచుకున్నాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యశస్వి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 2 డబుల్ సెంచరీలు సాధించాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే శుభ్మన్ గిల్ 31, రవీంద్ర జడేజా 37వ స్థానంలో ఉన్నారు. ఇక టెస్టు సిరీస్‌కు దూరమైన పరుగుల యంత్రం, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సయితం ఒర స్థానం మెరుగుపరుచుకుని 8వ స్థానానికి ఎగబాకాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్..

టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ లేపాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుత సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 4 మ్యాచు ల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో 700 మార్కును అందుకోవడానికి కేవలం 45 పరుగుల దూరంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News