Sunday, December 22, 2024

పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: గత కొన్ని రోజులుగా టెస్టు మ్యాచ్‌లలో పుజారా బ్యాటింగ్ విభాగంలో రాణించకపోవడంతో అతడి స్థానాన్ని మరో బ్యాట్స్‌మెన్ భర్తీ చేయాల్సి వస్తుంది. డబ్ల్యుటిసి ఫైనల్‌లో చెత్త ప్రదర్శన చేయడంతో పూజారాను జట్టు నుంచి తొలగిస్తున్నారు. పూజారా స్థానంలో యశ్వస్వి జైస్వాల్ టెస్టు జట్టులోకి తీసుకోనున్నారు. ఐపిఎల్‌లో జైస్వాల్ మెరవడంతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడి 80 శాతం సగటు ఉండడంతో టెస్టు జట్టులోకి అతడిని తీసుకోనున్నారు. డబ్ల్యుటిసి ఫైనల్‌లో రాణించిన అజింక్య రహానే తుది జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లను తీసుకోనున్నారు. ఉమేష్ యాదవ్ స్థానంలో ముఖేష్ కుమార్‌ను తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టు జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్ కూడా తిరిగి వన్డే, టి20 జట్లలో పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తన్నాయి. శివ్‌సుందర్ దాస్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది.

Also Read: వీడిన యువతి హత్య కేసు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News