Thursday, January 23, 2025

యశస్వి జయహో

- Advertisement -
- Advertisement -

డబుల్ సెంచరీ బాదిన యువ క్రికెటర్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో 20కి పైగా సిక్స్‌లు బాదిన రికార్డ్

రాజ్‌కోట్ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం

రాజ్‌కోట్ : టెస్టు చరిత్రలో భారత్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకూ 577 టెస్టులా 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఐదో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం.ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు, 2 వికెట్లు పడగొట్టిన జాదు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగి భారత విజయంలో కీలక భూమిక పోషించాడు.
చెలరేగిన యశస్వీ, సర్ఫరాజ్..
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఆదివారం ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214నాటౌట్), శుభ్‌మన్ గిల్ (91్ల), సర్ఫరాజ్ ఖాన్ (68నాటౌట్) అదరగొట్టారు. నాలుగో రోజు ఆటను భారత్ నైట్‌వాచ్‌మన్ కుల్‌దీప్ యాదవ్ కుల్‌దీప్ యాదవ్ (27)తో కలిసి గిల్ స్కోరుబోర్డును ముందుకు నడిపాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ అనవవస పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తరువాత కాసేపటికే కుల్‌దీప్ కూడా ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ ఝలిపించారు. శనివారం ఆటలో 104 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన జైస్వాల్ ఆదివారం బ్యాటింగ్‌కు దిగాడు. అండర్సన్ బౌలింగ్‌లో అతడు వరుసగా మూడు సిక్సర్లు బాదడం ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచాడు. ఈ క్రమంలో 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 బంతుల్లోనే శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే వరకు క్రీజులో నిలబడి వీరిద్దరు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
లక్ష్య  ఛేదనలో చతికిలా..
అనంతరం భారీ లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెన్ డకెట్ (4), జాక్ క్రాలే (11), ఒలీ పోప్ (3), జానీ బెయిర్‌స్టో (4్ల), జో రూట్ (7), బెన్ స్టోక్స్ (15), రెహాన్ అహ్మద్ (0) వరుసగా బ్యాట్లెత్తెశారు. బెన్ ఫోక్స్ (16)తో కలిసి టామ్ హర్ట్‌లీ (16) కాసేపు వికెట్ పడకుండా ఆడినా వారు క్రీజులో ఎక్కువసేపు నిలవలేక పోయారు. ఆఖర్లో మార్క్‌వుడ్ (33) కొద్దిసేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. జడేజా ఐదు వికెట్లు, కుల్‌దీప్ రెండు, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు.
రెండో స్థానానికి టీమిండియా..
మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో భారత్.. ఐసిసి డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో 59.52 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్.. 75 శాతంతో ఉండగా ఆస్ట్రేలియా.. 55 శాతంతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 21.88 శాతంతో ఇంగ్లండ్ 8వ స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగు గెలిచి రెండింట్లో ఓడి ఒకటి డ్రా చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News