హైదరాబాద్ం: ఉప్పలోని యశోద కృష్ణ టయోటా షోరూంలో కొనుగోలు చేసిన ఇన్నోవా క్రిష్టా వాహనానికి రెండు నెలలుగా టిఆర్ నెంబర్ కేటాయించకుండా ఇబ్బందులు పెట్టిన షోరూం యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు అక్కల సురేష్ సంబందిత అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఉప్పల్ రవాణా శాఖ అధికారులు స్పందించి షోరూం లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు అక్కల సురేష్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత సంవత్సరం నవంబర్ లో ఉప్పల్ లోని యశోద కృష్ణ టొయోట షోరూంలో ఇన్నోవా క్రిష్టా వాహనం కొనుగొలు చేయగా సదరు షోరూం నిర్వాహకులు ఎటువంటి రిజిస్ట్రేషన్ పత్రం లేకుండా వాహనానికి ఫైనాన్స్ చేయించి డెలివరీ చేశారని తెలిపారు. అప్పటి నుండి టఆర్ నెంబర్ కోసం తరచూ అడుగుతున్నా వివిధ కారణాలతో కాలం వెళ్లదీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉప్పల్ రవాణాశాఖ అధికారులకు పిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం దక్కలేదన్నారు. ఈ విషయంలో తన తరపున కేసును వాదించి అధికారులలో చలనం వచ్చేలా చేసే క్రమంలో ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి తనకి టిఆర్ నెంబర్ ఇప్పించి షోరూం లైసెన్స్ సస్పెండ్ చేయించడంలో చేసిన న్యాయ పోరాటం మరువలేనిదన్నారు. న్యాయవాది సుంకర నరేష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Yashoda Krishna Toyota Showroom Licence suspend