Sunday, December 22, 2024

కథ కోసమే ఈ సినిమా చేశాం

- Advertisement -
- Advertisement -

సమంత టైటిల్ పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. అన్ని భాషల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సమంతతో పాటు మిగతా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ ముగ్గురూ చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ స్పందన లభించిన నేపథ్యంలో కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ మీడియాతో ముచ్చటించారు.

కల్పికా గణేష్ మాట్లాడుతూ “యశోద… పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పాలి. ఎంటర్‌టైన్‌మెంట్, క్యూట్ రొమాన్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఉంది. అందుకే ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేయడానికి అంగీకరించా. కథ కోసమే ఈ సినిమా చేశా” అని అన్నారు. దివ్య శ్రీపాద మాట్లాడుతూ ”సమంత ’నేను బాగా చేశాను’ అని చెప్పారు. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా చూస్తే… క్యారెక్టర్ల పేర్లు అన్నింటికీ కృష్ణుడి కనెక్ట్ ఉంటుంది. సరోగసీ కాన్సెప్ట్ కొత్తది కాదని చెప్పడానికి పేర్లు ఆ విధంగా పెట్టారేమో. సమంత మాత్రమే కాదు, ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు. ప్రియాంకా శర్మ మాట్లాడుతూ ”సినిమా షూటింగ్ చేసేటప్పుడు గర్భవతులుగా కనిపించడం కోసం మేమంతా సిలికాన్ బెల్లీ ఉపయోగించాం. దాంతో షూటింగ్ చేయడం కష్టమే. ఇటువంటి కథలు అరుదు. ’యశోద’ లాంటి కథల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది” అని చెప్పారు.

‘Yashodha’ Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News