Saturday, January 18, 2025

తీవ్ర దుమారం.. ముస్లింతో బిజెపి నేత కుమార్తె పెళ్లి క్యాన్సిల్!

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ ముస్లిం యువకుడితో బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనామ్ కూతురు పెళ్లి ఆగిపోయింది. ఈ నెల 28న వీరి పెళ్లి జరిపేందుకు నిర్ణయించిన యశ్‌పాల్ బెనామ్.. తన కూతురి పెళ్లికి రావాలని పలువురు బిజెపి, కాంగ్రెస్ నేతలకు ఆహ్వాన పత్రాలు పంపించారు. దీంతో అది ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీసింది. పౌరీ ప్రాంతానికి చెందిన ఈ నేత కూతురు ముస్లింను పెళ్లి చేసుకోవడంపై ప్రతిపక్షాలే కాకుండా బిజెపి నుంచి కూడా తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు దిగిందని హిందూత్వ సంఘాలు మండిపడ్డారు. వివాదాస్పద కేరళ స్టోరీలో జరిగినట్లుగానే ఇప్పుడు బిజెపి నేత ఇంట్లోనే లవ్ జిహాద్ చోటుచేసుకుందని కొందరు వ్యాఖ్యానించారు. ఈ పెళ్లికి వ్యతిరేకంగా భైరవ్ సేన, బజ్‎రంగ్ దళ్‌ సంఘాలు నిరసన చేపట్టి యశ్‌పాల్ బెనామ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో యశ్‌పాల్ బెనామ్ తన కూతురు పెళ్లిని వాయిదా వేశారు.

కాగా, యశ్‌పాల్ బెనామ్ కూతురు లక్నో వర్సిటీలో చదువుకున్నప్పుడు ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడిందని, ఇది పెళ్లికి దారితీసిందని వెల్లడైంది. తన కూతురి పెళ్లికి రావాలని ఇప్పుడు పౌరీ మున్సిపాల్టీ ఛైర్మన్‌గా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే బిజెపి, కాంగ్రెస్ నేతలకు ఆహ్వాన పత్రాలు పంపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News