మథుర: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఓబిసి కేటగరిలో జాట్లను చేర్చడం సహా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిస్తామని అఖిల్ భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్స్ సమితి హెచ్చరించింది. వీలయినంత త్వరగా ప్రధాని తమ డిమాండ్లను నెరవేర్చకుంటే శాసనసభ ఎన్నికల్లో ‘బిజెపికి ఓటేయొద్దు’ అన్న పిలుపునిస్తామని ఆ సమితి జాతీయ అధ్యక్షుడు యశపాల్ మలిక్ గురువారం తెలిపారు. ఓబిసి కేటగిరిలో జాట్లను చేర్చకపోతే రానున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల్లో బిజెపికి ఓటేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామని ఆయన తెలిపారు.
2015 మార్చి 26న ప్రధాని నరేంద్ర మోడీ జాట్ల సముదాయాన్ని కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలలో(ఒబిసి) చేరుస్తామని హామీ ఇచ్చారన విషయాన్ని ఆయన ఇక్కడ గుర్తుచేశారు. అదే రోజున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అదే అంశాన్ని బలపరిచారని కూడా తెలిపారు. వివిధ సంస్థలకు చెందిన జాట్ నాయకులు కూడా ఇలాంటి వాగ్దానాలే చేశారన్నారు. అంతేకాక మాజీ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ నేతృత్వంలో 2016లో చేపట్టిన జాట్ ఆందోళన సందర్భంగా నమోదుచేసిన కేసులను ఉపసంహరించుకుంటామని కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని ఆరంభిస్తామని కూడా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి నాయకుడు రోహిత్ బాజ్‌పేయి తెలిపారు. ఇదిలావుండగా “మేము మ ఆ ఆందోళనను తీవ్రతరం చేయడమేకాదు, బిజెపికి ఓటేయొద్దని, ఆ పార్టీని రానున్న శాసన సభ ఎన్నికల్లో ఓడించాలని ఇతర వర్గాల వారికి కూడా నచ్చచెప్పుతాం” అని ఆ సమితి ప్రధాన కార్యదర్శి వీర్‌పాల్ సింగ్ తెలిపారు.
Yashpal malik threatens to BJP over OBC Status